Sunday, April 28, 2013

ముక్కుపుడక

ముక్కుపుడక 
తావిని మోయలేకా గాలికి పట్టిన 
స్వేదబిందువొకటి జారి 
ఆ పువ్వుకు ముక్కుపుడకైంది  అదిగో అలా .... 
*******
ప్రకృతి 
జీవిత ప్రాంగణంలో 
మనిషి వేగంగా పరుగెత్తడం 
మొదలెట్టిన చోటే ఆగిపోయింది 
అసలు ప్రకృతి. 
********
తోడు 
సుఖదుఃఖాలను  చెప్పుకోవడానికి 
ఆ రాదారికి కూడా 
కుడిఎడమల మానులున్నాయి 
కానీ బ్రతుకు రాదారిపై నీకో ....?
********
మగత 
తానెవరిని మత్తెక్కించాలని 
మగతగా అడుగుతుందా నిద్ర 
పబ్బుల వెంట తిరుగుతూ. 
********

6 comments:

  1. ఒకటి రెండు అద్భతంగా ఉన్నాయి

    మూడవది చెళ్ళు మనిపించేలా ఉంది

    మీ ప్రతి కవిత నాకు బాగా నచ్చుతాయి ధన్యవాదములు

    ReplyDelete
  2. బాగున్నాయ్ రమేష్ గారు,..

    ReplyDelete