Tuesday, October 25, 2011

VRUDHASRAMAM

1.రాలిన పండుటాకుని
తన నీడన పెట్టుకుని
ఆ వృక్షం ఎదురుగా ఉన్న
వృద్ధాశ్రమాన్ని దెప్పి పొడుస్తోంది
2.నా కలలన్ని పగిలాయి
కానీ మా వాడు కొన్న
ఈ జోడు మాత్రం ఊః ఊః
వాడంతే మన్నికకు
ప్రాణం యిస్తాడంటూ
రెండు పండుటాకులు 
ఆ నలుగు గోడల మధ్య
కళ్ళు తుడుచుకున్నాయి  

Saturday, October 15, 2011

నీ మరణం తో 
నా గుండెలో రగిలిన ఈ చితి 
నా కన్నీటి తోనే ఆరుతుందంటే
నే మరణించే దాక ఏడుస్తా  

JALADI GARIKI NIVALI

పల్లవికి గుండగిపోయిందా
చరణానికి గొంతెండి పోయిందా
స్మరించే జీవన సత్యం
కన్నీటి జలధి లో పడి
నింగిలోకి కొట్టుకొని పోయిందా
ఒంటరి వారిని చేస్తానని
ముందే తెలుసేమో
జీవిత కాలపు సత్యాలను
ముందే పూయించి
పని ఐపోయింది అనుకున్నారేమో
కన్నీటి జలధి ని ఈదమని వెళ్ళిపోయారు
ఆ జానపదాల గుణ నిధి
జాలాది .

Wednesday, October 12, 2011

ANDHAM

ఆమె అందాన్ని చూస్తూ
రెప్ప వేయని నాతో
నీవు చూడగా మిగిలిన సౌందర్యం
చాలులే లోకాన్ని శోభితం చేయడానికి
అంటుంది ఆ ప్రకృతి కాంత.

THOLI PARICHAYAM

తొలి పరిచయాన్ని తలచుకుంటూ
సిగ్గుతో ఇంకా రెక్కలన్ని విప్పకుండా ఉన్న
కలువ సిగ్గును తరిమిన
గాలికి కూడా తెలియకుండా సాగుతోంది
రాసలీల నా కన్నుల సాక్షిగా