Monday, April 22, 2013

వెన్నదొర

వెన్నదొర 
పున్నమి నాడు, తను కవ్వమై!
వెన్నెలను చిలికి, ఆ వెన్నను నాదు మనసుకు తినిపిస్తూ 
'వెన్నదొర' అంటే వీడేనని అందరితో అనిపిస్తుంది!
నా పెరటి కొబ్బరిచెట్టు. 
********
ఎదురుచూపు
రాలిపడే పూలతో,
తానేమి సౌరభించగలనని కాబోలు 
జారిపడే వాన చినుకులకై ఎదురు చూస్తుందా మన్ను. 
********
శిరస్త్రాణాలు 
ఉదయ వాహ్యాళి వేళ నీ, నా పదఘట్టనల 
తామెక్కడ గాయపడతామోనన్న జాగ్రత్తతో 
శిరస్త్రాణాలను ధరించి ఎలా కూర్చున్నాయో చూడా పచ్చికలు. 
*********
జలతారుమేఘాలు 
బురదింటి ఇంతికి 
నింగిలోని ముగ్ధమోహనునికి 
మనువు జరుగుతున్న ఈ వేళ 
మాటిమాటికీ అడ్డుతెరలై నిలిచి ఈ జలతారుమేఘాలు!
నును సిగ్గులవానలను కురిపించగలమూ  మేము 
కదలకుండా, కరగకుండానూ అంటున్నాయి. 
*********

3 comments:

  1. ఎదురుచూపు బాగుంది రమేష్ గారు

    ReplyDelete
  2. చాలా సున్నితంగా హృద్యంగా వున్నాయి రమేష్ గారు..
    అభినందనలతో..

    ReplyDelete