Monday, August 6, 2012

మధువు

మధువు 
పాత్రల కొద్దీ మధువును
కొసరి కొసరి పోస్తుంటే ఆ మేఘాలు!
మత్తులో పడి అడుగైనా కదపగలవా?
ఆ కొండలు.
**********
ప్రహేళికలు
చూపులతో నా సమస్త చీకట్లను వెలిగించే 
కాంతి ప్రహేళికలనెవ్వరు వెలిగించారు 
నీ కన్నుల.
*********
గతం
మనిషికి మనిషి దొరికాడంటే
తన గతం తనకు దొరికినట్లే
ఆ కాలానికి.
*********
అలంకారం
అద్దాన్ని నాకు అలంకారమెందుకంటే
ఓ పట్టాన వినిపించుకోకుండా
ఆ వాడని వసంతాన్ని నా పాలు చేసి
ఎలా వస్తూ పోతున్నాయో చూడా మేఘాలు
అంటోందా చెరువు.
**********

6 comments:

  1. చక్కని చిన్న కవితలు., అభినందనలు.
    హిరోషిమా మీద అణుబాంబు వేసిన రోజిది.
    ప్రపంచశాంతిని కోరుకుందాం – యుద్దాలను వ్యతిరేకిద్దాం

    ReplyDelete
    Replies
    1. thank you thappakundaa manandaram prapancha santhiki krushi cheddam.

      Delete
  2. చాలా చాలా బాగున్నాయండీ:-)
    అందుకేనా కొండలు కదలలేవు...!!

    ReplyDelete