Saturday, August 25, 2012

అన్వేషణ

అన్వేషణ 
పదం పాడుతున్న 
ఆ వేణువు పాదాలను 
అన్వేషిస్తూ సాగేవే 
రాధ కన్నుల పయనాలు.
******
శకుంతల 
ఎంతమంది దుష్యంతులను 
సంపాదించుకుందో శకుంతలై 
పాపమా శరద్పూర్ణిమ.
******
చినుకు పాప  
ఆకాశమంత ఎత్తు నుండి 
జారిన ఆ చినుకంటి పాపకు 
దెబ్బ తగలనీయకూడదని 
ఎన్ని పచ్చటూయలలు కట్టిందో 
చూడా మాను కొమ్మ కొమ్మన.
*******
ప్రయోజకులు 
అంతగా గాలి తిరుగుళ్ళు తిరిగే 
తన బిడ్డలనెపుడింత ప్రయోజకుల్ని 
చేసిందో ఆ ఆకాశమని 
హర్షాతిరేకంలో తడుస్తూ 
పొగుడుతున్నాయా చెట్లన్నీ.
*******
 

6 comments:

  1. అలతి పదాలతో అందమైన భావాన్ని తెలియజేసే మీ చిన్ని కవితలు చాలా బాగున్నాయి అబినందనలు....

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు వీణ గారు..

      Delete
  2. అన్వేషణ...చినుకు పాప...
    చాలా బాగున్నాయి రమేష్ గారూ!
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు ధన్యవాదాలు

      Delete
  3. చినుకు పాప లో భావం చాలా బాగుందండి.

    ReplyDelete