కసరత్తు
నా చూపులను గెలవాలనిఅలా అలా కసరత్తు
చేస్తున్నాయా కిరణాలు
ఈ అలలపై
*******
సగం సగం
ఇంటి దాని కన్నీళ్ళు సగంఒంటి నుండి జారిన చెమట నీళ్ళు సగం
చాలవేమిటోయ్ నింపడానికా
ఖాళీ మద్యం సీసాని
తొలకరి
తెల్లారుతూనే ఆకాశం పైకితొలకరిని కురిపిస్తుందా వనం
కిల కిల మంటూ
నా కళ్ళు
వికసిస్తున్న నీ వదనపు పరిమళాన్నిశ్వాసిస్తున్నాయి నా కళ్ళు
No comments:
Post a Comment