ఆగని కన్నీరుగా
ఆకాశం కూడానా మనసులానే
మబ్బులతో డాగులు పడింది
పెద్ద వర్షం రావలసిందే
ఆగని కన్నీరులా
****
సతీ సహగమనం
సతీ సహగమనమంటేఎమిటని ఆ కలువ కమలాల కన్నా
మిన్నగ చెప్పగలవారేవ్వరోయే!
****
పిసినారి సంద్రం
అంత చోటు తనకున్నానా కాళ్ళ కింది చోటును కూడా
ఎలా కరిగించుకుని పోతుందో చూడా సంద్రం
****
మిడిసిపాటు
మెరిసిపడే వెన్నెలకు
మిడిసిపడడం నేర్పింది
మా పల్లె చెరువు
No comments:
Post a Comment