బదులు
వయ్యారముప్పొంగే పరువంపు వేళఆ దరి కెన్ని ముద్దులిడినావని
ఎడబాసిన వేళ ఈ గోదారి నడిగితే
తిన్నెలుగా పరుచుకున్న
ఈ ఇసుక రేణువు లన్ని,అని
ఎంత అందంగా బదులిచ్చిందో చూడు
పేరంటాళ్ళు
పగలూ రాత్రీ ఎప్పుడూఎవేవో పిలుపులతో
ఇన్నిన్ని పేరంటాళ్ళను
ఎలా జరిపిస్తుందీ వనమని
ఆ చిటారు కొమ్మనో ఈ చిన్ని మొగ్గనో
అడిగావా ఎపుడైనా నువ్వు?
మెరుపు
నింగి తోపున పూచిన
పూలా మబ్బులను కూర్చి
మాల కడదామనుకున్న నా తలపుకు
చిక్కెనుగా మెరుపు దారమై
No comments:
Post a Comment