Saturday, March 28, 2015

మనిషి

మనిషి 


ఉండాల్సిన సుగుణాలన్నీ 
ఉన్నట్టుగా కనిపించే
ఎoడ మావి పేరే మనిషి 
*************

తాటికాయలు 

నా దేశ సంస్కృతి పై 
పడుతున్న తాటికాయలు 
ఈ వారాంతాలు 
*************

ఎoదుకో?

నాడు గంగలా పొంగిన సారస్వతం 
నేడు సరస్వతిలా అయిoదెoదుకో 
ఈ సినిమా పాటల్లో 
**************

మహాత్మా 

నోటితో వద్దన్న పనులన్నిటినీ 
నోటుతో చేయించడం నీకే చెల్లింది 
ఓ మహాత్మా 




2 comments:

  1. ఉండాల్సిన సుగుణాలన్నీ
    ఉన్నట్టుగా కనిపించే
    ఎoడ మావి పేరే మనిషి..టూ గుడ్

    ReplyDelete