తాంబూలం
ఆమె చేతులను చిగురింప జేసిఆతను! నాకేది ఆ వర్ణమని
అడిగాడు కాబోలు
తాంబూల మేసుకొచ్చిందామే
*******
వస్తుందా?
అర్ధ రాతిరి ఆడది ఒంటరిగా తిరిగే
రోజొస్తుందేమో గాని,
ఆ కధా నాయికి ఒంటి నిండా
గుడ్డ కప్పుకునే రోజు ..... ?
********
విరిసిన పూలై
రాతిరంతా నాతో
ముచ్చటలాడిన తారలన్ని
తెల్లారిందో లేదో
కిటికీలోంచి నన్ను చూస్తున్నాయి
విరిసిన పూలై
******
DVD
అనుబంధాల బరువును
దింపుకుంటుంది నా గుండె
DVD గా
********
No comments:
Post a Comment