హైకూలు
**************
**************
ఆకాశాన్ని దీవిస్తూ
అక్షతలు విడిచిందా పంట చేను
పక్షి గుంపులుగా
***********
కృష్ణుడే వచ్చి
కుచేలునికి మూడు గుప్పిల్లిచ్చి
అతగాడి సర్వస్వం దోచుకోవడమేనోయే
రాజకీయమంటే
***********
నలుగురితో సంఘర్షించిన వేళ
చరిత్ర లోకి నేను నడిచాను
నాతో నేను సంఘర్షించిన వేళ
తనుగా వచ్చి నాతో నడచిందా
చరిత్ర
**********
No comments:
Post a Comment