Tuesday, July 17, 2012

అభిసారిక

అభిసారిక 
ఆమె ఎంత అందగత్తె దానికి తోడు 
ఆపాదమస్తకమూ అలంకరించుకుందేమో 
దేనితో సరిపోల్చాలో కూడా తెలియడంలేదామెనిప్పుడు 
గతానా అంతే!
ఆమె హావభావాలెన్ని కావ్యాలకు జీవ శ్వాసలైనాయని 
ఎంతటి జ్ఞానవాహినిని ఆమె తన కనుసన్నలతో ఉప్పొంగించిందని 
అనుభవేకవేద్యమైన ఎన్ని అనుభూతులతో 
ఆగని ఈ కాలపు నుదుటి రాత రాసిందామె 
అవును! నిజమేనోయ్ 
తన ఒడిలో తానే పెరిగి విరిగే 
జీవన చిత్రమామె సొంతం మరి 
కాలం పట్టుకు పోతున్న తన అందాలను 
తిరిగి తిరిగి సంపాదిస్తూ కూడా 
తీరిక లేని నీ చూపొకటీ  సంపాదించలేక పోయానని 
బాధతో వికసిస్తూ నీ పలకరింపు కోసం 
అభిసారికలా ఎదురుచూస్తున్న ఆమె 
ఎవరో కాదోయ్ ఈ ప్రకృతి కాంత.
*********
నేతగాడు 
వెన్నెల నీడల్లో నిలబడిన 
ఆ పచ్చికలను పడుగు పేకలుగా చేసి 
నేల మీద వెన్నెల వన్నెల వస్త్రం నేయగల 
నేతగాడు ఆ గాలి.
********

4 comments:

  1. nice ramesh gaaru :)

    gaali ki prakruti kanta pulakinchindi :)

    ReplyDelete
    Replies
    1. సీత గారు రెండు కవితలను కలిపి మీరు స్పందించినందుకు నా మనసూ.....ధన్యవాదాలు

      Delete
  2. బాగున్నాడు మీ నేతగాడు...
    బాగుంది కవితల కలనేత...
    అభినందనలు రమేష్ గారూ!
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. మా నేతగాని పై మీ స్పందనల కలనేతకు ధన్యవాదాలు శ్రీ గారు

      Delete