Thursday, October 11, 2012

పండుటాకులు

పండుటాకులు 
ఐన వారి అడుగుల సవ్వడి కోసం 
నలుగుతున్న ఆ పండుటాకుల 
హృదయ వేదనను 
అడుగుల కింద నలుగుతూనే 
భాష్యం చెబుతున్నాయా ఎండుటాకులు.
********
బృందావని 
కన్నులు దీపాలు శ్వాస ధూపం 
నైవేద్యమిదిగో పెదవులకు పెదవులే 
అందించుకుంటున్నాయా బృందావనాన.
********
వాలి సుగ్రీవులు 
ఎదురుపడి ఆ కాన్వెంట్లో 
యుద్ధం చేసుకుంటున్న వాలి సుగ్రీవులనుకుంట 
ఈ ఆంగ్లము ఆ ఆంధ్రము 
అయ్యో! ఇది త్రేతాయుగం కాదుగా
పాపమా సుగ్రీవుడెలా.......?
*********

6 comments:

  1. పండుటాకులు బావుంది. ఇప్పుడున్న ఆకురాలు కాలానికి తగ్గట్టుగా ఉంది

    ReplyDelete
  2. పండుటాకుల హృదయ వేదనను చక్కగా చెప్పారు..

    ReplyDelete
  3. పండుటాకులు-ఎండుటాకులు ఎంత చక్కని పోలిక .వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది మీ కవిత

    ReplyDelete