Monday, October 1, 2012

తెలుగు వాచకం

తెలుగు వాచకం 
నాడు నా బ్రతుకెంతో ఘనం 
నేడు బ్రతకడమే గగనమంటూ 
ప్రతిధ్వనిస్తూనే ఉందా తెలుగు వాచకం.
*********
నల్లవాడు 
అక్కడ కోయిల పిలుపులు లేవు 
తేటిని పిలిచే పూవులు లేవు 
కానీ ఆ వనాన నిత్య వసంతం 
 కొలను లేదు కలువలు లేవు 
కానీ నిత్య పూర్ణిమ ఆ తీర ముఖచిత్రం 
  అక్కడ పెదవి దాటి ఊరేగిన గాలికి 
పాదాలు కదిపే పడుచులాటలో 
నిదురన్నది మరచి  రాతిరి 
ఆ నల్లవాడి మేని వర్ణమైందేమో 
********
చేతి గాజులు  
రవ్వంత సడి లేకుండా 
ఆమె ఊసులు వినాలన్న నా తలపును 
రాగయుక్తంగా తీరుస్తున్నాయి 
ఆమె చేతి గాజులు.
*******
ఆత్మీయత 
పంచిన ఆత్మీయత 
చాలలేదనుకుందేమో 
ఎగసి ఎగసి గాలితో కలసి 
తుషారమై మరీ నన్ను తాకుతోంది 
జోరువాన.
*********


2 comments:

  1. తెలుగు వాచకం ఏమి చెప్తుందో చాలా బాగా చెప్పారు.
    ఆత్మీయత గూర్చి ఇంకామంచిగా చెప్పారు రమేష్ గారు.

    ReplyDelete
  2. ధన్యవాదాలు ఫాతిమా గారు

    ReplyDelete