Tuesday, September 25, 2012

వర్ణాశృవులు

వర్ణాశృవులు
 
బాల్యాన ముగ్గురు తాతలు చేయిపట్టి 
సౌందర్య వనాంతరాల కుసుమరాగరంజిత పదాన 
నన్ను నడిపించారోయ్!

ఆపై రూపరేఖా లావణ్యాలతో విచ్చుకున్న 
నా యవ్వన సోయగాన్ని రసికదిగ్గజాలైన 
ఆ ఎనమండుగురు ఎంతందంగా వర్ణించారోయ్!
భువనైకమోహన హాసవిలాసాన.

ఇక నా కౌమార కౌశలాన 
రవి అస్తమయమే ఎరుగమన్న ఆ తలబిరుసు దొరలే 
నింగికంటా ఎగసిన  నా కీర్తి కేతనాల ముందు 
అవనత మస్తకాలతో నిలిచి 
సంతత మనోసీమల నుండి జారిన 
ఆ మాధుర్య మోదామృత ధారలు త్రావి 
చిరంజీవులన్న యశము బడలేదా?
 
ఇపుడా వైభోగమంతా యేమాయెనో గానీ నాకపుడే వృద్ధాప్యమాపాదించి 
ఆ మొనదేలిన ఇరువదియారు అమ్ముల అంపశయ్యపై పరుండ బెట్టారు.
ఆ! ఇపుడు నా మరణ ముహూర్తం ఆసన్నమైనదనీ ,
సంస్కృతికి పాలు పట్టించిన నా స్తనాలుకూడా వట్టిపోవునని 
ఈ కాలానికిపుడు తెలిసొస్తుందిలే 
నీ వల్లే కాదులే మీ అందరి వల్ల.
**********

 

4 comments:

  1. nijame how sad it is mee kavitha very nice sir

    ReplyDelete
    Replies
    1. వీణ గారు ధన్యవాదాలు

      Delete
  2. వట్టిపోవునని ఈ కాలానికి ఇప్పుడు తెలిసి వస్తుందిలే..
    పోయేది తెలిసినప్పుడు.. కొసని పట్టుకుని అయినా.. కాపాడుకోగలరని.. నాకనిపిస్తూ ఉంటుంది,కవిత్రయం,భువన విజయ దరహాస చంద్రికల ఆనవాళ్ళు మరుగైనా.. అంతో ఇంతో మిగలడానికి .. ఉన్న ఉనికి చాలని.. అనుకుంటూ.. ఆశావాదంతో..మన వంతు కృషి చేయాలి కదండీ.
    మీ వేదన సమంజసమే!:(

    ReplyDelete
    Replies
    1. వనజ గారు మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు

      Delete