Monday, September 17, 2012

గానవాహిని

 గానవాహిని 
పికమాపిన గానాన్ని ఆ సెలయేరు 
ఆ యేరొదిలిన  పదాన్ని 
ఈ ఆకులనుండి జారే మంచుబిందువులు 
ఆలపిస్తుంటే 
ఇక తన గానవాహినికి అంతమెక్కడిదని  
అడుగుతుందా అడవి.
********
మెరుపు తీగ 
ఆ వీణతీగ కన్నా అందంగా ఉంది కదా 
మీటితే ఇంకెంత వీనులవిందైన 
సంగీతం వినిపిస్తుందో అనుకుంటే 
ఇలా ఉరిమిందేమిటా మెరుపుతీగంటూ 
కరుగుతున్నాయా మేఘాలు.
*********
వర్ణ విక్రయశాల 
ఏ దారినీ పూలన్నీ పోయి ఆకాశంలోని 
ఆ వర్ణ విక్రయశాలలోని రంగులను 
కొనుక్కొచ్చాయో ఆ దారినే పోయి 
అన్ని స్వప్నాలను కొనుక్కొచ్చింది 
నా మనసు.
********
శృతి 
కరిగిన ఆ ఇల్లాలి కలలు 
కన్నీళ్ళై కారుతున్నా నిషా మత్తులో పడి 
మేలుకోడా మొగుడు 
కానీ ఆమె ఒడిలోని బిడ్డడో!
ఆమె కన్నీళ్ళకో శృతినీయడా?
*********

7 comments:

  1. merupu teegala gaanavaahini baagundi ramesh gaaroo!...
    @sri

    ReplyDelete
  2. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

    లాస్య రామకృష్ణ
    బ్లాగ్ లోకం

    ReplyDelete
    Replies
    1. లాస్య రామకృష్ణ గారు ధన్యవాదాలు మరియు మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు

      Delete
  3. భాస్కర్ గారు ధన్యవాదాలు మరియు మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు

    ReplyDelete