Thursday, September 6, 2012

సజీవగీతాలు

సజీవగీతాలు 
మమతానురాగాలు 
పల్లవీ చరణాలుగా వినిపించే 
సజీవగీతాలను విని ఎంతకాలమైందో అని 
తనలోతాను అనుకుంటూ  
ముందుకు సాగుతుందీ కాలం.
********
ముత్యాలు 
అనుమానాలో ఆనందాలో గానీ 
ఆమె కన్నుల వెంట ధారగా జారి 
ఆ కడలి కూడా అసూయ పడేంతగా 
యీతని చేతుల్లో ముత్యాలౌతున్నాయా బృందావనాన.
********
మనసు 
ఎపుడంటే అపుడు 
కన్నీటి తడిని అద్దగలిగే 
గుప్పెడంత చేను 
తన చేతిలో ఉందని కాబోలు 
ఎపుడూ ఏదో ఒక భావాన్ని 
పండిస్తూనే ఉంటుంది నా మనసు.
*******
నదీ పాయలు 
తీగలా మానుని చుట్టుకున్నట్లే 
నదీ పాయలన్నీ 
ఈ పుడమి మేనుని............
********

6 comments:

  1. అన్నీ బాగున్నాయి....

    ReplyDelete
  2. mutyaalu....mutyaale...
    abhinandanalu ramesh gaaroo!
    @sri

    ReplyDelete
  3. మనసుని మీరు చెప్పిన మనస్సుతో మెప్పించేసారు రమేష్ గారు..చక్కని భావనలు.

    ReplyDelete
    Replies
    1. subha garu welcome to my blog and thank you for your comment

      Delete