Friday, August 1, 2014

స్వర సన్యాసం

స్వర సన్యాసం 
స్వర సన్యాసం  చేశాయోయ్!
నేటి పాటలు. 
ఇక మనసులనెలా గెలుస్తాయిలే. 
****
భోగం 
ఎంత భోగమో 
ఈ నీడకి 
నేలే బోయీ అయింది. 
****
పెద్ద గీత 
కాలం మాత్రం లోకపు గాయాలను 
మాన్పుతోందేమిటోయ్ ఈ మధ్యన!
గీత పక్కన పెద్దగీతను గీస్తోంది తప్ప. 
****
దగ్గర-దూరం 
పేగుకి మెతుకును 
దగ్గర చేయడానికి 
ఎంత దూరమౌతున్నారు 
ఈ మనుషులు. 
****
 


4 comments:

  1. పెద్ద గీత బాగుంది.

    ReplyDelete
  2. మినీ కవితలెప్పుడూ , సూక్ష్మంలో మోక్షాన్నందిస్తున్నట్లుంటాయి . చిట్టి నయనాలు అయనాలకావల వున్నవన్నీ చక్కగా చూపిస్తున్నట్లు .

    స్వర సన్యాసం

    స్వర సన్యాసం చేశాయోయ్!
    నేటి పాటలు.
    ఇక మనసులనెలా
    గెలుస్తాయనుకొంటున్నావ్ ?

    ****

    భోగం

    ఎంత భోగమో
    నా నీడకి
    ఈ నేలే బోయీ అవుతుండగా !

    ****

    పెద్ద గీత

    కాలం మాత్రం లోకపు గాయాలను
    మాన్పుతోందేమిటోయ్ ఈ మధ్యన!
    గీత పక్కన పెద్దగీతను గీసుకుపోతూ .

    ****

    దగ్గర-దూరం

    పేగుకి మెతుకును
    దగ్గర చేయడానికి
    ఎందరినో దూరం
    చేసుకుపోతున్నారీ మనుషులు.

    ****

    ReplyDelete