తస్మాత్ జాగ్రత్త
ఎన్నాళ్ళైనా ఏడుద్దాం
నిట్టూర్పులెన్నైనా విడుద్దాం
పసిమొగ్గలపై మృత్యువు కక్కిన హాలాహలాన్ని
దిగమింగ కాలాన్ని దొర్లిద్దాం
వీడిది తప్పంటూ, వాడిది తప్పంటూ వాదులాడేద్దాం
చివరకు, నూరేళ్ల రాతనూ రాయలేని
విధాతదే నేరమంటూ ముగిద్దాం
ఎందుకంటే, ఘోరం జరిగాక మనకో నేరస్తుడు కావాలిగా అంతే!
ఆ! ఇక పదండి
భారంగా మూలిగే మనసును
మరల బ్రతుకు బగ్గీలో కూర్చోబెడదాం
వద్దన్నా, దానిని అక్కడి నుండి లాక్కెళ్ళిపోదాం
ఎందుకంటావేమిటోయ్
అక్కడ నీ మనసుకు మానవత అంటితే!
అందులోంచి ఆలోచన పుడితే! అది ఆచరణైతే!
అమ్మో మనిషనిపించేసుకుంటావేమో??
అందుకే తస్మాత్ జాగ్రత్త.
******
అక్కడ నీ మనసుకు మానవత అంటితే!
ReplyDeleteఅందులోంచి ఆలోచన పుడితే! అది ఆచరణైతే!
అమ్మో మనిషనిపించేసుకుంటావేమో??..అవును అలాగే అనుకుంటారు చాలామంది.
:-(
Deleteరమేష్ ,
ReplyDeleteప్రయాణంలో మజిలీలు ఎలా అవసరమో , బిడ్డకీ బిడ్డకీ ఎడమెంత అవసరమో , అలాగే కవితలో కూడా కొంచెం ఎడం వుండటం చాలా చాలా అవసరం . కొంచెం ఆలోచించి చూడు .
ముగింపు కంటికింపుగా వుంది .
dhanyavaadaalu sarma garu mee salaha thappaka sveekaristhaanu
Delete