ఊహ
కాలాన్ని దొర్లించి,
కలాన్ని కదిలించి!
తీపి గురుతుగానో, చేదు గుళికగానో!
మనసున మిగిలిపోదూ! ఊహ.
****
బాష్పాభిషేకం
విచ్చుకున్న పూలైన వేళ ఆ పెదవులు!
తొలి మంచు బిందువుల తళుకద్దడానికి
ఎంత తొందర పడుతున్నవో
చూడా ఆనందబాష్పాలు.
****
తల్లిదండ్రులు
మళ్ళీ మళ్ళీ పుట్టే నా మనసుకు
ఆలోచన, అనుభవాలే
తల్లిదండ్రులు.
****
చెరపలేని దూరం
చిరునవ్వు చెరపలేని దూరాన్ని చూపమని
నా మనసుని అడిగాను.
ఎక్కడెక్కడ తిరిగిందో అది పాపం
అలసి అలసి నన్ను చేరి
నా కన్నా మిన్నగా నవ్వుకుంది.
****
Chaalaa baagundi Ramesh gaaru:):)
ReplyDeletethank you
Deleteఅన్నీ బాగున్నాయి . కాకుంటే ఈ ఒక్క లైనులో మరొక్క మారు " అలసి " వస్తే ఆ అలసిన పదానికి న్యాయం చేకూర్తుంది . ఒక్క మారు ఆలోచించి చూడు రమేష్ .
ReplyDeleteచిరునవ్వు చెరపలేని దూరాన్ని చూపమని
నా మనసుని అడిగాను.
ఎక్కడెక్కడ తిరిగిందో అది పాపం
అలసి అలసి నన్ను చేరి
నా కన్నా మిన్నగా నవ్వుకుంది.
******
మీరు చేసిన మార్పు బాగుంది ఇలా మీ సలహాలు అందిస్తూఉండండి. ధన్యవాదములు
Deleteశర్మా అన్నయ్యా..,నేను గత ఏడాదిగా అబ్యర్దిస్తూనే ఉన్నాను, కవిత ముక్కలు,ముక్కలుగా అయిపోతుందీ, భావాలలో మార్పు వస్తుందీ.. అని జగ మొండి వినరు :-))(సరదాగా అన్నాను సర్, )
ReplyDelete:-) :-)
Delete