అదృష్టం
అప్పుడప్పుడే గెలుస్తాయి విప్లవాలంటూ,
ఆశ పడ్డ పేగులపై
నీళ్ళను చల్లింది
అదృష్టం.
***
ఊరంత అందం
అంతందంగా ఊరంత అందం
తమ కంట పడుతున్నందుకు కాదూ
అడుగైనా కదపనిది ఆ కొండలు.
***
రుచులు
నిండు విస్తరోడికి పడనివి
అర్ధ విస్తరోడికి అందనివే
రుచులంటే.
***
స్వప్నం
తనను కనే మెలకువ
నిద్దురకే ఉందని,ఆ వేళ వరకూ
నా మనసును కనిపెట్టుకునే
ఉంటుందా స్వప్నం.
***
రుచులు బాగున్నాయి . స్వప్నం నిజాన్ని నిక్కచ్చిగా చెప్పినట్లుంది .
ReplyDeleteచాలా బాగుంది .