పుడమి కల
కురిసే వాన చినుకులన్నీ
మెరిసే మెరుపు తీగపై
పూలై పూస్తే!
పుడమి కలలు గనే వసంతమే కాదా? అది.
*****
బ్రతుకు
గాఢమ్ గా
నిద్దరోయిన మృతువు కనే కలేనేమో
బ్రతుకంటే.
*****
అనాధలు
వికసించిన మనసుతో
మానవత! కన్నీరెడుతూ చిరునవ్వు
ఒకరినొకరు ఓదార్చుకుంటున్నాయి!
అనాధలైనామని.
*****
మనసు
ఏకాంతానుభూతిని పొందలేక
నా పైన తానే సానుభూతి పవనమై పరచుకుంది
నా మనసు.
*****
నైస్
ReplyDeletethank u sarma garu
ReplyDelete