Tuesday, January 28, 2014

జ్ఞాపకాల పూలు

జ్ఞాపకాల పూలు
నాలుగు, జ్ఞాపకాలను పూలు లేనపుడు 
నలుగురూ మెచ్చే 
మధువెక్కడుంటుందోయ్! మదిలో 
*****
బరువు 
బరువే, 
బాధ్యత అయింది! పాపం
ఆ బాల్యానికి 
****
నవవధువు
నిత్యమూ బుగ్గ చుక్కతో భాసిల్లే 
నవవధువులాటి భాగ్యమబ్బిందా చీకటికి 
ఈ మిణుగురుల పుణ్యమా అని 
******
జటాయువు
సీతాపహరణ వేళ 
జటాయువు అయింది 
ఆంగ్లపు చేతుల నా సంస్కృతి చిక్కిన వేళ 
తెలుగు స్థితి 
*****

4 comments:

  1. మీ కవితలు చిన్నగా సిరిమల్లె పువ్వుల్లా ఉంటాయి మధురమైన తేనెల భావాలతో రమేష్ గారు.

    ReplyDelete
  2. మొదటి నాలుగు పంక్తుల్లోనే ఆకట్టుకున్నారు.

    ReplyDelete