Monday, November 5, 2012

మెరుపు దారం

మెరుపు దారం 
ఎన్ని  పూలు 
నేలరాలాయో చూడు 
ఆ మెరుపు దారం తెగగానే .
********
నిగ్రహం 
ఆచ్చాదనలను, ఆభరణాలను వదిలేసి 
నిగ్రహాలు, గౌరవాలు 
కావాలంటున్నాయా అందాలు.
********
కవితాకపోతం  
భావాలను రెక్కలుగా సాచి 
ఎగురుతూ వచ్చి 
మీ గుండెలపై వాలుతుంది 
నా కవితాకపోతం.
*******
హృదయపాన్పు  
నే తలచిన రీతిన వచ్చి 
నీవెంత అలసితివోనని నాదు విరహాన,
సంగమాన నీ మేనుకు 
పాన్పుగా పరతు నాదు హృదయాన్ని.
*********

6 comments:

  1. annee baagunnaayi merupu daaram, nigraham indaa bavunnai ramesh garu

    ReplyDelete
  2. మెరుపు దారం తెగి రాలినపూలు
    మీ భావాల పదజాల ముత్యాలు
    రెండూ మదినిదోచే గుళికలు..

    ReplyDelete
  3. బాగున్నాయ్ మీ కవితాకపోతాలు, రమేష్ గారు.

    ReplyDelete