ఉదయ సుందరి
తాను రాసిన పాటను
పాడడం కోసమని
ఎన్ని గొంతులను మేల్కొల్పిందో
ఆ ఉదయ సుందరి.
*******
నేతగాడు
తానే ఆ బట్టకు వేలాడి
తాను నేసిన బట్ట ఎంత నాణ్యమైనదో
చెప్పకనే చెప్పాడా నేతగాడు.
********
తోటమాలి
హృదయ క్షేత్రాన
వెలుగనే విత్తొకటి నాటి
లోకమంతటా దాని ఫలాలను
కోసుకునే తోటమాలిని నేను.
*******
కలల మధువు
పూలై విచ్చిన ఊహల నుండి,
కలలనే! మధువును గ్రోలుతుంది నిదుర
తుమ్మెదై
******
ReplyDeleteఉదయ సుందరి !
ఉషో వాజేన వాజిని !
చీర్స్
జిలేబి