ఆడది
అణచుకోవడం చేతకాక బ్రద్దలై
అది విశ్వమైంది గానీ
అణచుకోవడం నేర్చి బ్రద్దలవకుంటే అదీ
ఆడదే అయ్యేదేమో.
******
సన్మానం
చేసిన సేవను మరువలేక కాబోలు
కొమ్మ కొమ్మ ఆపి మరీ
సన్మానిస్తోంది
ఆ రాలుతున్న పండుటాకును.
*******
పూల చరిత్ర
పట్టు బట్టి మరీ ఆ పూల చరిత్రని
గ్రంథస్థం చేస్తున్నాయి
ఈ తేనెటీగలు.
********
మానవత
మానవత
ముందుకు నడవాలంటే
తరాలు వెన్నక్కి నడవాల్సిందే.
**********
వావ్ అన్నింటికీ. డబుల్ వావ్ సన్మానం, పూలచరిత్రలకి
ReplyDeletethank u
DeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDelete