సున్నాలు - శూన్యాలు
సున్నాలతో ఎదిగేది
జీతం.
శూన్యాలతో నిండేది
జీవితం.
***
వెన్నెల విల్లు
చూపుల విరాళమిచ్చిన! నాకు
వెన్నెల విల్లు రాసిచ్చింది
ఆ జాబిలి.
***
ఇంట.... రచ్చ....
విభజించి పాలిస్తూ రచ్చ గెలిచి
కలిసుంటే కలదు సుఖమంటూ ఇంటా గెలిచి
రెండిటా చరిత్రకెక్కిన ఘనతనే సాధించిందిగా
రవి అస్తమించని ఆ రాజ్యం.
***
పాపం - పుణ్యం
పాపానికి పల్లకీని
పుణ్యానికి పాడెని
ఏక కాలంలో భుజాలపై మోసే
బోయీలెందరో ఈ కాలాన.
***
సున్నాలతో ఎదిగేది
ReplyDeleteజీతం.
శూన్యాలతో నిండేది
జీవితం.
అనటం కంటే ,
శూన్యంలో ఒదిగేది
జీవితం .
' వెన్నెల విల్లు ' చాలా బాగుంది .
పాపానికి పల్లకీని
పుణ్యానికి పాడెని
ఏక కాలంలో భుజాలపై మోసే
బోయీలెందరో ఈ కాలాన.
కంటే
పాపానికి పాడెని
పుణ్యానికి పల్లకీని
ఏక కాలంలో భుజాలపై మోసే
బోయీలెందరో ఈ కాలాన.
బాగుంటుందేమో .