Wednesday, August 28, 2013

నిజం

నిజం
నీ కన్నుల కన్నా 
ఎక్కువ లావణ్యాన్ని సంపాదించాలని కాబోలు 
ఆ పూవులన్నీ అప్పుడే ముడుచుకున్నాయి 
రోజు గడిచింది. నిజం తెలిసింది. 
బాధతో అవి వాడిపోయాయి. 
*******
ఏకాంతం
నా ఏకాంతాన్ని చూసి 
జాబిలి మబ్బు చాటైతే,
కలువ ఏకాంతాన్ని చూసి 
ఆ మబ్బు కాస్తా కరిగి 
నీపై నా సందేశాన్ని కురిపించింది. 
********
ఎదురుచూపు 
తొలిపొద్దు లో ఆకాశంలో రేగిన విప్లవానికి 
ఆదిమూలం, నీకై ఎదురుచూస్తూ విసిగిపోయిన 
నా హృదయం కాక ఇంకేమిటి?
********
ఆమె
ఎందుకు ఆకాశం లోకి 
అదే పనిగా చూస్తావు అని ఆమెనడిగాను. 
చూడనీ ఆమె తన చూపులతో 
నక్షత్రాలను వెలిగిస్తుంది 
అని ఆకాశం బదులిచ్చింది. 
*******
జ్ఞాపకాలు
అమ్మో! నీ జ్ఞాపకాలను లెక్కించడమంటే 
నూరేళ్ళ నా శ్వాసలను 
తారలతో గుణించడమే 
ఐనా ................. 
*******

2 comments:

  1. చాన్నాళ్ళుగా అడగాలని అనుకుంటున్న విషయం. ఇలా చిన్ని చిన్ని శీర్షికలతో అసంపూర్తిగా రాసే మీ కవితలు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇదేపైనా ప్రత్యేక స్టైలా? ఏమనుకోకండి.

    ReplyDelete
    Replies
    1. prerana gaaru ఒక ఆలోచన లేదా ఒక అనుభూతి కలిగించి అది కొనసాగడానికి ఇంకొన్ని వరుసలు ఉంటే బాగుండేదే అని అనిపించేలా నా కవితని వదిలేయడమే నా స్టైల్. అలా మీరు మీ ఆలోచనతో ఫ్రేమ్ చేసుకుని నా కన్నా ఎక్కువ అనుభూతిని పొందాలనేదే నా ఆలోచన.

      Delete