Wednesday, September 4, 2013

నాగరికత

నాగరికత
అవమానం అనుకోపోతే 
నాగరికతకు నేటి ప్రమాణమేమిటో చెప్పనా!
నడిరోడ్డుపై పోతున్న మానమే. 
******
వానచినుకులు
బాటసారులై 
గగనపు వీధుల సంచరించే 
కారుమబ్బులకు పట్టిన 
చెమట చుక్కలేమో ఈ వానచినుకులు.
ప్రజ్ఞలు 
వెలుగులోకొచ్చే స్థోమత లేక 
కొన్ని ప్రజ్ఞలు, ఎంత చీకట్లు మిగిల్చాయో 
నా భారతాన. 
******
ఆత్మహత్య
కావాలని చమురొంపుకుంటున్నాయి 
కొన్ని దీపాలంటూ 
ఉసూరుమంటున్నాయి 
రేపటి వెలుగులు. 
******

5 comments:

  1. ఎప్పటిలా చిరు ముత్యాలు మీ కవితలు

    ReplyDelete
  2. ఎప్పటిలా చిరు ముత్యాలు మీ కవితలు

    ReplyDelete