Wednesday, January 23, 2013

అవినీతి

అవినీతి 
ఊళ్లకు ఊళ్లనే కాదు 
కొండలను గుట్టలను కూడా 
కదిలించే అంకుశం గాదటోయ్ 
ఆ అవినీతి అధికారి చేతిలోని కలం.
*******
నీతిని గ్రంధస్థం 
అవినీతిని కంటస్థం చేసేవాడేనోయ్ 
అసలు భారతీయుడంటే 
*******
ఎన్ని చరణాలతో 
పల్లవిస్తోందో చూడు 
బ్రతుకుపాటలో ఆ అవినీతి.
********
శిఖండిని చూసి అస్త్రసన్యాసం చేసిన 
భీష్ముడిది తప్పు కాకపోవచ్చు గానీ 
శిఖండిలాటి నేతలను చూస్తూ 
నువ్వు ఆలోచనాస్త్రాలు 
సన్యసించడం మాత్రం......
*******
ఉదయించి చీకటిని తెచ్చిందిగా 
అస్తమిస్తేనే గానీ 
వెలుగురాదా అవినీతి.
*******

4 comments:

  1. "ఉదయించి చీకటిని తెచ్చిందిగా
    అస్తమిస్తేనే గానీ
    వెలుగురాదా అవినీతి" ...

    అవునేమో కదా..

    ReplyDelete
  2. అవినీతి పై ఆలోచనాస్త్రాలు ఆలోచింపజేస్తున్నాయి

    ReplyDelete