భారత మాతకు జై, అనమన్నవాడు
భారత నేతను 'చీ' అంటే ఊరుకుంటాడ?
నుదిటి రాతకు ఓ విధాత అని నమ్మే భారతీయత,
ఎదుటి రోతకు, ఏ నేత? అని అడగని విధేయత
కలగలిసిన ఈ భారతమాతింట!
మన మనసులలో మాటకు
నేతల, మూడో కంటి మంటే తోడు.
అందుకే, మనం మౌనమనే కవచం ధరిద్దాం.
నేతల వాతలు ఎన్నెన్ని పెరిగినా
పొరలను పరుచుకుంటూ,
మన కవచాలను బలపెట్టుకుందాం.
మన కన్నా వందల రెట్లు పెద్దదౌతున్న
మన కవచం, పాతాలపు చీకట్లు
మనకు చూపిస్తున్నా! జై జై అందాం.
ఎందుకోయ్ ఈ జే జే లని ఎవ్వరడిగినా,
భరించే భారతీయతకు,
అలవాటైపోయిన అరాచకానికి అనేద్దాం!
పైకి కాదు సుమీ .......
దీన్నే ఎవడి ఖర్మకి వాడు ఛస్తాడు అంటే....
ReplyDeleteఅలానే అనుకుందాం సార్! ధన్యవాదాలు
ReplyDelete