Saturday, April 2, 2016

కూనలమ్మ పదాలు

1. మనిషి మనిషిగ లేడు 

    మనిషి మనిషితొ రాడు 

    మనిషి మనిషికె కీడు 

    ఓ జాబిలమ్మ 

2. వాన చినుకుల తోడి 

    మట్టి వాసన జోడి 

   కట్టె కరువుకు పాడి 

   ఓ జాబిలమ్మ 

3. చదువు కట్టలు కట్టి 

   ప్రేమ నటకన పెట్టి 

    బలికి ముద్దుల పట్టి 

    ఓ జాబిలమ్మ 

4. వయసు తొందర సేయ 

    చాటు సరసం పూయ 

    ఫోను కెక్కెను చెలియ 

    ఓ జాబిలమ్మ 

5. మమత పాతర వేసి 

    మనసు ఉసురులు దీసి 

    బంధ మాయెను బోసి 

    ఓ జాబిలమ్మ 







3 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. బాగుంది.-- వాన చినుకుల తోడి
    మట్టి వాసన జోడి
    కట్టె కరువుకు పాడి --- బాగుంది. వాన జల్లుల (స)వ్వడి వినపడి వర్షాలు(ఏళ్ళు) నిండి ఎదురు చూపుల తోడి కూనలమ్మా ఎదలారె కూనలమ్మా

    ReplyDelete