Monday, June 16, 2014

అందం

అందం
 ఓ పక్క ఆ ఆకాశం 
తిండి పెట్టక కడుపు మాడ్చుతున్నా 
అందాన్ని ఎంతందంగా 
నెమరువేస్తోందో చూడా నది 
ఆ ఇసుక తిన్నెల మధ్య కూర్చుని. 
*****
జలపాతం
దగ్గరకు పిలిచి 
అంత గంధం నా మేనంతా పూసి 
తన గాంధర్వాన్నంతా వినిపిస్తుంది 
నాకా జలపాతం. 
******
తలపు
పరుగెడుతున్న ఆ ఏటి చరణాలకు 
గజ్జె కడదామనుకున్న నా తలంపే 
నవ్వు నురుగులుగా పల్లవిస్తుంది అదిగో అలా.... 
******
దివాలా
కలలు పండించలేక 
నిదుర కూడా వ్యవసాయంలా 
దివాలా తీసిందోయ్. 
******

1 comment:

  1. గజ్జె కడదామనుకున్న నా తలంపే
    నవ్వు నురుగులుగా పల్లవిస్తుంది...nice lines

    ReplyDelete