Monday, December 2, 2013

శంఖం

శంఖం
రహస్యాలను! నా కన్నా శ్రావ్యంగా
ఎవరు చెప్పగలరోయ్ నీ చెవిలో
అని అడుగుతున్న ఆ శంఖాన్ని చూస్తూ
అంత కన్నా తెల్లగా పాలిపోయింది
నా ప్రియురాలి ముఖం.
******
పండుటాకులు
గిట్టి, రాలిపోయినా!
తమ పరిచయాలకు పలకరింపులకొచ్చిన
లోటేమిటంటున్నాయి!
పారుతున్న ఆ సెలయేటి అండ చూసుకుంటూ
ఆ అడవి మానుల పైని పండుటాకులు.
*******
చెరువు ఆటలు
క్షణం తీరిక లేకుండా మా ఊరి చెరువు
గాలికాడుకునే ఆటలే
ఆ గట్టుకు చేరేసరికి పాటలౌతున్నాయి.
*********

తొలి లేఖ
విరబూసిన పూదోటకెలా అప్పగిస్తానో!
సెగలు గ్రక్కే ఎడారికీ అలానే అప్పగిస్తాను
నా మనసు కళ్ళాలనని,
నా కంటికే తనింటి పిలుపుల
తొలిలేఖనంపుతుందీ ప్రకృతి.
*********
మనసులు
సుక్ష్మజీవులను చూడగలుగుతున్నాం కదా అని

అంత కన్నా సుక్ష్మంగా, అంతరిక్షాలను అందుకోగలుగుతున్నాం కదా అని
అంత కన్నా దూరంగా మనసులను విసిరేసుకుంటే ఎలాగోయ్.
**********

2 comments:

  1. "మనసులు" అద్భుతంగా ఉంది.
    చాలా బాగా రాశారు. అభినందనలు.

    ReplyDelete
  2. అంగుళం అంత కవితలో అనంతమైన భావాలు కురిపించటం ఎంతో ప్రసంసనీయం .

    ReplyDelete