Friday, November 1, 2013

గుడ్డిదీపం

గుడ్డిదీపం
గుడ్డి దీపమైతేనేమోయ్!
గుడిసెలోని వారికి 
కళ్లిచ్చిందది!. 
****
 శకటాలు
మనుషులనే దీపాలు వెలిగించుకుని 
పగిలిన గుండెలే టపాసులంటూ 
దీపావళి పండుగ చేసుకుందా శకటం.
******
అనాకారి
అణాలు కాణీలు ఉన్నపుడు 
ఇంత అనాకారిగా లేవు!
రూపాయిలొచ్చాక రూపు మారిన అనురాగాలు. 
*******
పెరుగుట విరుగుట .....
పెరుగుట విరుగుట కొరకే 
అన్న సామెత కాస్తా 
పెరుగుట కొనే వారి నడ్డి విరుగుట కొఱకే 
అన్నట్లుగా తయారైందీ మధ్యన. 
******
బ్లాగ్మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు

1 comment:

  1. మీకు మా దీపావళి శుభాకాంక్షలు

    ReplyDelete