రాజ్యాంగం, చట్టాలను మించి ప్రజలను పాలించడానికి ప్రభుత్వాలకు ఏమైనా
ఉపయోగపడుతున్నాయా? అంటే అవి లాఠీలు బూట్లే. కానీ నిన్నటి రోజున
పాపం! ప్రభుత్వం ఆ లాఠీలు పట్టుకునే చేతుల కోసం, ఆ బూట్లు తొడుక్కునే కాళ్ళ
కోసం వెతుక్కోవలసి వచ్చిందేమో! అయ్యో! ఇలాటి దుస్థితి ఇక ఏ ప్రభుత్వానికి
కలగకుండుగాక.
ఐనా ఆకలి కేకల్ని హాహాకారాలుగా, భయానక గీతులుగా మలచి, ఆత్మగౌరవంతో
కాళ్ళను పట్టించుకునే ప్రభుత్వ దమన నీతికి ఏం భంగం వాటిల్లిందని అక్కడ.
షరామామూలే!
కాకపోతే ఇక్కడ ప్రజలకన్నా లాఠీలే ఓ కొత్త నీతి నేర్చికోవలసి వచ్చింది.
పట్టించుకోమన్నందుకు, తమను పట్టుకున్న చేతులపై కూడా ఒక్కోసారి విరుచుకు
పడాల్సివస్తుందని. పాపం ఇది లాఠీ స్వామ్యమని అందరూ దాని ముందు
సమానమేనని వాటికి మాత్రం తెలీదా?
ఇక ప్రజలంటావా? మాటాడుకోవడానికి అందరూ ఉంటారు. మదన పడడానికి
కొందరుంటారు. అడగడానికైతే ఎంత మంది ఉంటారో? ఇది చాలదా? మన వెచ్చని
కన్నీళ్లను తాగుతూ సమస్య ఎప్పుడూ పచ్చగుండడానికి.
No comments:
Post a Comment