పున్నమి
పున్నమి, దీపాన్ని పట్టుకుని
గోదారి గట్ల వెంట వెతికేది ఏమై ఉంటుందంటావ్?
తెలీదంటావేమిటోయ్ నీ మనసే
పాపమోసారి దొరకనివ్వవోయ్ దానికి.
******
ఫాషన్
అందాలన్నిటికీ
అందమైన వలువలు కడుతుందా చీకటి
ఫాషన్ అంటే ఏమిటో తెలీకుండానే
*****
జోడెడ్లు
జోడెడ్లే మనిషి, మనసు
కానీ రెండూ
ఒకే తోవన నడవడమే అరుదు.
******
మనసు
ఉన్న చోటెక్కడో చెప్పదు కానీ
విషాదమైనా ఆనందమైనా
తనువంతా కదిపి పారేస్తుంది
నా మనసు.
******
రమేష్ గారు , మీ కవితలో భావాలు చాలా అలవోకగా పలికిస్తారు,
ReplyDeleteచాలా బాగున్నాయి.అభినందనలు.
Nice one:):)
ReplyDelete