వలపు పేరంటం
నా ఏకాంతాన్ని పంచుకుంటూ
ఆ వెన్నెల ఇంకా ఇంకా వెలిగిపోతుంటే,
వలపు పేరంటపు తోరణాన్ని
ఎంతందంగా కట్టిందో చూడా కలువ
నా కనుదోయి వాకిట.
*****
ఆధునిక కాపురాలు
అయితే నిశ్శబ్దం లేదా రాద్ధాంతం అనే
రెండు సేతువులే అనుసంధానిస్తున్నాయి
కొన్ని ఆధునిక కాపురాలనీమధ్యన
******
ఆధునిక అందాలు
ఆభరణాలను, ఆచ్చాదనలను వదిలేసి
నిగ్రహాలు, గౌరవాలు కావాలంటున్నాయి
ఆధునిక అందాలు కొన్ని
******
మౌనరాగాలు
పొదల ఎదలలో దాగిన
మౌనరాగాలను తన గొంతుతో
ఎంత చక్కగా ఆలపిస్తుందా గాలి.
******
ఆదునిక అందాల మీద మీ వ్యాఖ్య నిజాన్ని చెప్తుంది.
ReplyDeleteప్రతి భావమూ దేనికదే చక్కగా ఉంది.
thank you meraj garu
ReplyDelete