Sunday, January 1, 2012

PALLE CHERUVU

నేల చెట్లతో వాటి నీడలతో
ముఖం చాటేస్తే
తన గుండె చిన్నదే ఐనా
ఎంత అనురాగముందో చూడు దానిలో
ఒంటరి చందమామను
ఒడిలో లాలిస్తుందా పల్లె చెరువు.
              *******
నన్ను ఇంకాసేపు
తనతో ఉంచుకోవాలని
పచ్చ చీర కట్టి
తెలుపు ఎరుపు పూలు చుట్టుకుని
కళ్ళను చేపల్లా తిప్పుకుంటూ
కదలక నన్నే చుస్తున్నామెను
సమయం లేదని వదలి వచ్చేసాను
యమానుకుంతోందో పాపం ఆ చెరువు
పాడు కాలమా ఎపుడు నీ తొందర నీదే.

                 ********

చెరువులో ఓ వెన్నెల రాత్రి
ఆ భామల ఫాషన్ షో చూడు
అందం కాన్తులీనడమంటే ఏమిటో
నీకు తెలియక పోతే ఒట్టు.

          ********

ఎంత సోకో చూడు
ఈ చెరువుకి
కట్టిన చీర మళ్లీ కట్టి కనబడదు
ఆకాశం సాక్షిగా.

       *******

ఓ నాడు
ఆ పల్లె ఆడబడుచుల
సంకల్లో బిడ్డలా ఊరేగి 
నేడు ఎవరు లేని అనాధలా ఉందా చెరువు.

             **********

No comments:

Post a Comment