Saturday, June 30, 2012

దాంపత్యం

దాంపత్యం
రేపటికి వాడిపోయే పూలతో 
క్షణానికి ఇంకిపోయే సిరాతో 
సరిపెట్టుకుంటుంటే ఆ పెళ్లి తంతు 
తానేమో రోజులు లెక్కెట్టుకుంటుందా దాంపత్యం .
*******
ఇరువురు యోధులు  
ఆశయాలు వేరైన ఇద్దరు మహా యోధులను 
ఎదురు పడనిచ్చి కూడా 
రవ్వంతైన అలజడి రేగకుండా 
నిదుర దారినొకరిని స్వప్నపు దారినొకరిని 
సాగనంపే ధీమంతురాలు నా మనసు.
********
నెలవంక-నిండు జాబిలి  
ఎపుడైనా నెలవంకను  నిండు జాబిలిని 
 కలిపి ఒకేసారి చూసావేమిటోయ్ లేదా 
ఐతే నిదురలో లీలగా నవ్వుతున్న 
ఆ పసివాడి మోమునోసారి చూడు.
********
ఆత్మీయత  
అన్వేషణ ఆత్మీయతను పెంచితే 
ఆ ఆత్మీయతను 
పంచుతుందా అనుభవం.
*******

12 comments:

  1. నెలవంక-నిండుజాబిలి చాలా బావుంది.

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మయి గారు నా బ్లాగ్ కు స్వాగతం మీ స్పందనకు ధన్యవాదాలు

      Delete
  2. బాగున్నాయి రమేష్ గారూ!
    ప్రత్యేకంగా మూడోది....:-)
    @శ్రీ

    ReplyDelete
  3. చాలా బాగున్నాయి రమేష్ గారు .....
    నెలవంక పసివాడి నవ్వులో ఉంటే,నిండు జాబిలి పసివాడి మోము లో ఇరుక్కుపోయుంటుంది.
    చాలా చక్క గా పోల్చారు .

    ReplyDelete
  4. Manasunadham ga nidra swapnamane kavita adbutamga rasaru hatsoff to you

    ReplyDelete