Thursday, June 28, 2012

జలపాతం

జలపాతం 
వానచినుకిచ్చిన హాయిని 
మరువలేకే కాబోలా కొండ 
ఆ జలపాతాన్ని అలా సాగనంపి 
తుషారాన్ని మీదకొంపుకునేది.
*******
కాలిబాట  
చూపినట్టే చూపి చిటికెలో 
ఆ కాలిబాటనెలా మాయం చేసిందో చూడు 
మేఘాల మధ్య ఆ మెరుపుతీగ.
********
  మహావృక్షం  
వేరు కాండము ఉండి 
పత్రాలనేవే లేకుండా 
ఇంత ఒత్తుగా నా గదినిలా కప్పిన 
ఈ దీపపు మహావృక్షాన్ని 
ఆకులన్నీ కన్నులు చేసుకుని 
విస్తుపోయి చూస్తోందా మాను.
*******
పనిపసోడు  
రోజుకెన్ని సార్లో ఆ ముత్యాల పంట 
కాపుకొచ్చి రాలుతుంది 
ఈ పనిపసోడి ఒంటి మీదుగా 
కనీసం ఆ  పంటకైనా  
గిట్టుబాటు ధర ఇవ్వదెందుకోయ్ ఈ లోకం.
*******


12 comments:

  1. చాలా బాగున్నాయండీ.....

    ReplyDelete
  2. బాగున్నాయి రమేష్ గారూ!
    చూపినట్టే చూపి చిటికెలో
    ఆ కాలిబాటనెలా మాయం చేసిందో చూడు
    మేఘాల మధ్య ఆ మెరుపుతీగ...
    ....
    చక్కటి భావం
    @శ్రీ

    ReplyDelete
  3. ఆ జలపాతాన్ని అలా సాగనంపి
    తుషారాన్ని మీదకొంపుకునేది.
    chakkaga raasaarandi.
    keep writing.

    ReplyDelete
  4. Replies
    1. prince welcome to my blog and thank you very much.

      Delete
  5. ఇలా ముత్యాల గుళికలు రోజుకోనాలుగు....ఓకే:-)

    ReplyDelete