Tuesday, June 26, 2012

చిరునవ్వు

చిరునవ్వు
మనకన్నా ఎక్కువగా పడుతూ లేస్తూనే 
ఎంత అందంగా నవ్వగలదు ఆ అల 
మరి నీవేమిటోయ్ 
చిరునవ్వుని గతజన్మ లోనే వదిలేసినట్లు 
ఎప్పుడూ అలా ........
******
నీడ
ఎప్పుడో గానీ కన్నెత్తి చూడనా 
ఐనా గానీ అది ప్రతి క్షణము 
నన్నే కనిపెట్టుకుని ఉంటుందోయ్ 
నిజంగా అనుబంధమంటే 
నాదీ నా నీడదేనోయ్.
*******
ఒయ్యారం
మేఘాల్లో దాగిన 
ఆ నదీ యవ్వనాన్ని 
ఆడుతూ పట్టుకొచ్చేసిందా మయూరం 
ఇక చూడా నది పొంగులు.
******
ఆంగ్లం
మనదన్న దాన్ని మింగేస్తూ కూడా 
మనతోనే కొనియాడబడడం 
ఆ ఒక్క ఆంగ్లానికే చెల్లు.
******

14 comments:

  1. very nice ramesh garu :).
    ఆంగ్లం గురించి ఇంకా బాగా చెప్పారు..

    ReplyDelete
  2. ధన్యవాదాలు సీత గారు

    ReplyDelete
  3. చాలా బాగా వివరించారు అండీ...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సాయి గారు

      Delete
  4. Replies
    1. మంజు గారు నా బ్లాగ్ కు స్వాగతం ఇంకా చాలా చాలా ధన్యవాదాలు మీ సూచనకు కూడా

      Delete
  5. ఒయ్యారం....
    చాలా బాగా ఒలికింది...:-)
    అభినందనలు మీకు...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. ఒలికిన ఒయ్యారాన్ని ఒడిసి పట్టిన మీ మనసుకు నా ధన్యవాదాలు

      Delete
  6. మీ కవితలు చిన్న వాక్యాల్లో మంచి అర్థాలు పలికిస్తున్నాయి.

    ReplyDelete