నిద్రనిచ్చిన నిశ్శబ్దాన్ని
ఎంతందంగా అభినయిస్తున్నాయి
లేస్తూనే ఆ పక్షులు.
******
కరగకుండా ఆ నెమలికి
కరిగీ వాగుకి ఆట నేర్పేదే
కారుమేఘం.
******
వేదాంతిననిపించుకోవాలని
చీకటి సారస్వతాన్ని
పదే పదే వల్లె వేస్తుంది
ఆ కీచురాయి.
*****
వయసుతో సంబంధం లేకుండా
శివునికన్నా ఇంకో నయనాన్ని
అదనంగా సాధిస్తున్నారు కొందరు.
*******
బాగుంది అండీ.. కవిత
ReplyDeleteఅవును ఆ లాస్ట్ నాలాంటి కళ్ళద్దాల వారి గురించే కదూ...
nice, bhaghunnaiandi, kavithalu
ReplyDelete