Friday, June 29, 2012

ప్రణయం-ప్రళయం

ప్రణయం-ప్రళయం 
ప్రణయానికైనా ప్రళయానికైనా తానే దిక్కని 
ఆ పువ్వుతో ఎలా ఆటలాడుతోందో 
చూడా గాలి 
అచ్చమా అతివతో ఆడుకునే అతగాడిలా.
********

తడిసిన మనసు 
ఆ తుషారం వెనుక షికారెళ్లి 
తడిసిన నా మనసు
తననారబెట్టుకుంటోంది చూడా ఎండమావిలా.
*******
స్వప్నం  
నిద్రకు  చెవులు లేవని 
తనకు పెదవులు 
వద్దనుకుందా స్వప్నం .
*******
తెలుసనుకున్నా  
ఇవ్వడమే తెలుసనుకున్నా 
ఆ కడలికి  చెలీ!
నీ పాద ముద్రలు మాయం చేసే దాకా. 
*******

6 comments:

  1. చక్కని భావాలు...
    సంక్షిప్తమైన కవితలు...
    బాగుంది రమేష్ గారూ!
    @శ్రీ

    ReplyDelete