ఆ చిన్న రాయికి
నేనిచ్చిన స్వేచ్ఛ
ఎంతటి విప్లవాన్ని
లేవదీసిందా చెరువులో.
*******
రెప్పలు చిలికే
స్వప్నాలకు
ఊహలని పేరు.
*****
ఆఖరికి అడిగి లోనికి వెళ్ళాల్సిన
అగత్యమేర్పడిందా కిరణానికి
ఈ అపార్టుమెంటుల పుణ్యమా అంటూ.
*******
వానచినుకు సందడిని మళ్ళీ మళ్ళీ
పరిచయం చేస్తుందా చెరువుకి
ఎగిరెగిరి పడుతూ ఆ చేపపిల్ల.
******
ఎడ్ల గిట్టల
చప్పుడునా పంటచేను మరచినట్లు
పిల్లల పద ఘట్టనలను ఏనాడో
మరచిపోయిందా కాన్వెంటు ప్లే గ్రౌండ్.
******
nice, keep writing
ReplyDelete