బృందావనం
అక్కడ కోయిల పిలుపులు లేవు
తేటిని పిలిచే పూవులు లేవు
కానీ ఆ వనాన నిత్య వసంతం
కొలను లేదు కలువలు లేవు
కానీ నిత్య పూర్ణిమ ఆ తీర ముఖచిత్రం
అక్కడ పెదవి దాటి ఊరేగిన గాలికి
పాదాలు కదిపే పడుచులాటలో
నిదురన్నది మరచి రాతిరి
ఆ నల్ల వాడి రంగైందేమో.
********
వైభోగం
విరులన్నిటికీ రంగులిచ్చి
ఆ విలాసమేల తనకీయలేదటంచు
వాపోయిన ఆ గడ్డి పూవుకు
ఘన వైభోగమే ఇచ్చిందా ప్రకృతి
తుషారబిందు స్నాన శ్రీమంతినిగా .
*******
నిశ్శబ్దం
రాతిరి నిశ్శబ్దాన్ని పదిలంగా దాచి
పుడమి గుండె తలుపులు తడుతున్నాయి
ఆకులపై నుండి జారే
మంచు బిందువులతో ఆ చెట్లు.
*******
super...chaala baagunnayi
ReplyDeleteThankyou very much.
Deleteభలేరాసారు.
ReplyDeletethank you.
ReplyDeleteరమేష్ గారూ!
ReplyDeleteచాలా బాగుంది...
@శ్రీ
శ్రీ గారు ధన్యవాదాలు
Delete