పెళ్ళి విందు
నీలి మబ్బుల మాటుగా
ఆయన పై నుండి తలంబ్రాలు పోసాడు
ఈమె గారు కింది నుండి
పచ్చలు పైకెగరేసింది
ఇంకేముంది పసందైన పెళ్ళివిందు
పరచుకుంది చూడు కనులముందు.
********
ధీమంతురాలు
ఊహలు స్వప్నాలతో
ఓ వైపు తప్పటడుగులు వేస్తూనే
ఇంకో వైపు అనుభవాల చేతికర్ర ను వదలని
ధీమంతురాలు నా మనసు.
*******
కలసిన మనసులు
మనసులు కలిసేలా
మాట్లాడుకోవడం ఎలాగో
కేవలం ఆ చీకటికి దీపానికే తెలుసు.
******
cheekati deepam, chakka ga raasaarandi,
ReplyDeletekeep writing.
thank you bhaskar garu for watching my verses regularly
ReplyDeleteమూడు ముచ్చటైన ముత్యాల గుళికలు..
ReplyDeletethank you very much padmarpitha garu.
Deletenice feeling with definition....
ReplyDeleteWelcome to my blog &Thank you very much Sri garu.
Deleteచాలా బాగున్నాయి రమేష్ గారు ......
ReplyDeleteధన్యవాదాలు సీత గారు.
ReplyDelete