తనను అణచి కూడా
ఆకాశమంత స్వేచ్ఛనిచ్చింది
ఈ మన్నేనని కాబోలు
మానైనా ఈ మన్నునొదలదా విత్తు.
*******
నే కన్న కలలన్నీ కరిగి
కను జారి అలలైనాయని తెలిసి
చూడా సంద్రం
తానుకన్న స్వప్నాలనెలా దాచుకుందో
ముత్యాలుగా .
*******
మనకైతే కళ్ళ నుండి
ఆ మేఘాలకైతే ఆకు అంచుల నుండి
జారతాయా ఆఖరి జ్ఞాపకాలు.
******
చూపుడు వేలిని చుట్టుకుని
ఆ ఐదు లేత వేళ్ళు షికారుకు రావడం
అప్పుడప్పుడూ లీలగా చూస్తుందీ లోకం.
*******
వియోగాన్ని కూడా
మెరుపు లాటి మనసుతో ఆస్వాదించడం
నీకే చెల్లిందని నేను అభినందించేంతలో
ఎంత బిగ్గరగా ఏడుస్తుందో చూడా ఆకాశం.
********
చాలా బాగుంది ...nice
ReplyDeletethank you seetha garu.
Deleteబాగుంది....
ReplyDeletesai garu thank you
Deletenice feel...
ReplyDelete@sri
thank you sri garu.
Delete