దీపానికి కూడా
వెలుగును అరువీయగలిగేది
నీ చిరునవ్వే.
*****
మౌనమంటే విసిగి ఆ ఆకాశమే
మెరుపునాహ్వానించుకుంటే
నీవో చిరునవ్వును కూడా.....?
******
సందిగ్ధత అనే
గీత వెనుక
ఎంత జ్ఞానసాగరమాగిపోయిందో .
*****
అవసరాన్నిబట్టి విరుస్తూ
జీవిత మాధుర్యాన్ని
ఎంత అందంగా వెక్కిరిస్తున్నాయో
పెదవులు.
******
దీపానికి కూడా
ReplyDeleteవెలుగును అరువీయగలిగేది
నీ చిరునవ్వే.
bhagundandi.
అలా నవ్వుతూ ఉంటే కరెంట్ ఎంత ఆదానో కదా:-):-)
ReplyDeleteJust kidding....nice expressions!