నిజమవ్వాలంటూతనకు తానే రాసుకునే రాతను
ఆ విధాతకు కూడా నేర్పిస్తే
ఎంత బావుణ్ణు నా ఊహ.
******
అలజడిని
పోగేసుకోవడంలో పోటీ పడేవే
మనసులన్నీ.
******
చావు పుట్టుక
పగలు రాత్రి
వెలుగు చీకటి
వేటి వ్యతిరేకాలు వాటికున్నాయని
నాకు వ్యతిరేకమైంది నా మనసు.
*******
వెలుగప్పుడప్పుడూ ఈర్ష్య పడుతుంది
చీకటి అప్పుడప్ప్పుడూ భయపడుతుంది
నా మనసు లోతుల్లోకి చూసి.
******
No comments:
Post a Comment